టవల్ తో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్బాంధ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని గఫ్ఫార్ బస్తి శివారులోని ఖాళీ ప్రదేశంలో 35 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సెక్యురిటి గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు తో ఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పొలీసులు….మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates