నిమ్స్ హాస్పిటల్ వెనుక ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. నిమ్స్ ఆస్పత్రి వెనుకవైపు ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాక

దాదాకు బదులుగా జై షా

నాలుగేళ్లయినా ఎట్టి బతుకులే! నాలుగున్నర ఏళ్లలో రూ.100 పెంచిన్రు

Latest Updates