తన వైరస్ కుటుంబానికి సోకకూడదని వ్యక్తి ఆత్మహత్య

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఒకరినుంచి మరొకరికి సోకుతూనే ఉంది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. దాదాపు 673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వైరస్ ఇంట్లో ఒక్కరికి వచ్చినా.. ఆ ఇంటి కుటుంబ సభ్యులందరికీ వచ్చే అవకాశముంది. అలా భావించి కర్ణాటకకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు.

కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని నార్నాడు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ కేఎస్ ఆర్టీసీలో కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని స్నేహితుడికి కరోనా వైరస్ సోకిందని.. దాంతో ఆ వైరస్ తనకు వచ్చే అవకాశముందనే భయంతో ఆయన తన ఇంటి దగ్గరలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. గోపాలకృష్ణ చనిపోవడానికి ముందు తెల్లవారుజామున 2గంటల వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత వారంతా పడుకున్నారు. కుటుంబ సభ్యలు ఉదయం నిద్రలేచేసరికి గోపాలకృష్ణ ఇంట్లో కనిపించలేదు. ఇంటి బయటకు వెళ్లి చూస్తే ఒక చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు గోపాలకృష్ణకు ఎటువంటి వైరస్ సోకలేదని తేల్చారు. అయితే గోపాలకృష్ణ సూసైడ్ చేసుకునే ముందు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్‌లో తనకు వైరస్ వస్తుందేమోనని అనుమానంగా ఉందని.. ఆ వైరస్ తన కుటుంబానికి సోకకూడదనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. అంతేకాకుండా.. ఆ నోట్‌లో తన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరాడు.

తనకు వైరస్ సోకితే.. అది తన కుటుంబాన్ని కూడా కబలిస్తుందనే అనుమానంతోనే గోపాలకృష్ణ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోపాలకృష్ణ చాలా కాలంగా డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో.. ఈ మధ్యే ఆయన డ్రైవర్లకు శిక్షకుడిగా ప్రమోషన్ పొందారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే..

అమెజాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లు!

కరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం

Latest Updates