పోలీస్ స్టేషన్‌కు పిలిపించార‌న్న అవ‌మాన భారంతో వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా : ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులు పెట్టారని నార్ల ఆంజనేయులు అనే వ్యక్తి మనస్థాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మేళ్లచెరువు మండలం రేవూరులో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

రేవూరులో ఉన్న ఓ సిమెంట్ కర్మాగార యాజమాన్యానికి, ఆంజనేయులు కు మధ్య ఉన్న‌ భూ వివాదం లో కర్మాగార యాజమాన్యం.. ఆంజనేయులు పై మేళ్లచేరువు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అది అవమానంగా భావించిన ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనంతరం హుజుర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Latest Updates