సిద్దిపేటకు చేరిన ‘సేవ్ ఇండియా’

సిద్దిపేట టౌన్​, వెలుగు : గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కరోనా వ్యాధిపై అవగాహన పెంచేందుకు మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేపడుతున్నాడు. సేవ్ ఇండియా అనే పేరుతో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రచారం ఆదివారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ప‌ట్టణంలో పలు వీధుల్లోతిరుగుతూ అవగాహన కల్పించారు. శ్రీకాంత్‌ను సిద్దిపేట టు టౌన్ సీఐ పరశురామ్ గౌడ్, రిజర్వ్ ఇన్‌స్పెకర్ రామకృష్ణ‌ అభినందించారు.

Latest Updates