పోలీస్ వెహికిల్ ఢీకొని వ్యక్తి మృతి

పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉప్పల్ పోలిస్టేషన్ పరిదిలో జరిగింది. కర్మన్ ఘాట్, శుభోదయ కాలనీకి చెందిన చందర్ రావు(35)ను గురువారం పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. దీంతో అతన్ని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం పొద్దున చందర్ రావు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.

Latest Updates