అనుమానస్పద రీతిలో యువకుడు మృతి

హైదరాబాద్: పాత బస్తీకి చెందిన సందీప్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లేల్ గూడలో జరిగింది. సందీప్ రెండు సంవత్సరాల నుంచి జిల్లేల్ గూడలో నివాసం ఉంటూ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం తన ఇంటి ముందే విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారమందించారు. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates