ట్రాక్టర్ నడుపుతుండగా గుండెపోటు.. డ్రైవర్ మృతి

కృష్ణా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. గ్రామస్తుల దాహం తీర్చే ఆ డ్రైవర్ విధి నిర్వహణ లొనే ప్రాణాలు విడిచాడు..ఈ విషాదకరమైన సంఘటన బందరు మండలంలోని గుండుపాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగింది.

ఓడపాలెంకు చెందిన గుండాబోయిన జ్వాల నరసింహారావు చుట్టుపక్కల గ్రామాలకు ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా చేస్తుంటాడు. ఎప్పటిలాగే గురువారం కూడా ట్రాక్టర్ పై  వాటర్ సప్లయి చేస్తున్న సమయంలో నరసింహారావు కు ఒక్కసారిగా  గుండెపోటు వచ్చింది. బాధతో డ్రైవింగ్ కంట్రల్ చేస్తూ  సాయం కోసం రోడ్డు ప్రక్కన ఆపే ప్రయత్నం చేశాడు. బాధను తట్టుకోలేక ట్రాక్టర్ పైనే ప్రాణాలు విడిచాడు. ప్రాణాలు విడిచే సమయంలోను స్టీరింగ్ గట్టిగా పట్టుకొని రోడ్డుపక్కకు ట్రాక్టర్ నిలిపి ఏ ఒక్కరికి అపాయం కలిగించకుండా తన బాధ్యత పూర్తి చేయడం పలువురికి కంట నీరు కల్గిస్తుంది. 40 ఏళ్లకే నరసింహ రావు తనువు చాలించడంతో గుండుపాలెంలలో విషాఢచాయలు అలుముకున్నాయి.

Latest Updates