బిడ్డ పుట్టకముందే ఫేస్ బుక్ లో అమ్మకానికి యత్నం

  • మహారాష్ట్రలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఔరంగాబాద్: బిడ్డ తల్లి కడుపులో ఉండగానే ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఔరంగాబాద్ జిల్లా రంజన్ గావ్ షెంపుంజికి చెందిన శివశంకర్ తగడే నిందితుడు. అతని మరదలు ఏడు నెలల గర్భిణి. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని శివశంకర్ కోరుకున్నాడు. కడుపులో ఉన్న బిడ్డను అడ్డుగా ఉందని భావించాడు. బిడ్డ పుట్టాక అమ్మేయాలని శివశంకర్, అతని మరదలు నిర్ణయించారు. పిల్లలు లేనివారిని ఫేస్ బుక్ ద్వారా కాంటాక్ట్ చేశారు. డీల్ ఫిక్స్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడు శివశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. జువైనెల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest Updates