గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓయో రూమ్‌లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోరబండ శివబస్తీకి చెందిన 22 ఏళ్ల వరప్రసాద రావు హైటెక్ సిటీలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి శుక్రవారం కొండాపూర్‌లోని ఓయో హోటల్ రూమ్‌కి వెళ్లాడు. రాత్రి ఇద్దరి మధ్యా ఏం జరిగిందో ఏమో కానీ, తెల్లారేసరికి వరప్రసాద రావు మృతి చెంది ఉన్నాడు. శనివారం ఉదయం ఓయో హోటల్ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌కు చేరిన గచ్చిబౌలి పోలీసులు.. వరప్రసాద రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వరప్రసాద రావు గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

For More News..

రాజశేఖర్ ఆవేశపరుడు: హీరో సుమన్

దాడి వీడియో: రేప్ బాధితురాలి కుటుంబంపై దాడి.. తల్లి మృతి

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు

Latest Updates