కరోనా పై ట్రంప్ సలహా: చేపల తొట్టిని క్లీన్ చేసే ట్యాబ్లెట్ వేసుకొని ఓ వ్యక్తి మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చెప్పాడని చేపల తొట్టిని శుభ్రం చేసే క్లోరోక్విన్  మింగారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ల కలయికలో రానున్న కొత్త ఔషధాలు, వైద్య చరిత్రను మారుస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఎక్కువగా క్లోరోక్విన్ ను ఆక్వేరియంలను శుభ్రం చేసేందుకు, చేపలు నిల్వ ఉన్న తొట్టిని క్లీన్ చేసేందుకు ఉపయోగిస్తారు.

ట్రంప్ చెప్పారంటూ ఆరిజోనా ప్రాంతానికి చెందిన దంపతులు క్లరోక్విన్ వేసుకున్నారు.  కొద్దిసేపటికే  వారిద్దరూ స్పృహ కోల్పోగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.

క్లోరోక్విన్ కు ఆమోదం

చేపల తొట్టిని శుభ్రం చేసేందుకు క్లోరోక్విన్ మలేరియా, లూపస్ మరియు రుమటాయిడ్, ఆర్థరైటిస్  కోసం మెడిసిన్ రూపంలో తీసుకునేలా  ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కరోనా తగ్గించేందుకు ఈ మెడిసిన్ పై పరిశోధనలు జరుపుతున్నట్లు   సూచించారు. బ్యానర్ హెల్త్ నిపుణులు సైతం కరోనా ను కట్టడి చేసేందుకు ట్యాబ్లెట్లు లేదా ఇంట్లో వినియోగించే రసాయనాల్ని తీసుకోకూడదని  ప్రజలను కోరినట్లు సిఎన్ఎన్ నివేదించింది.

Latest Updates