ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ : పోల్ పైనే హెల్పర్ మృతి

సిద్దిపేట జిల్లా : కరెంట్ షాక్ తో వ్యక్తి చనిపోయిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లాలో జరిగింది. కోహెడ మండలం, ఆరేపల్లి గ్రామానికి చెందిన హెల్పర్ తిరుపతి ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ చేస్తుండగా షాక్ కొట్టింది. దీంతో కరెంట్ పోల్ పైనే  చనిపోయాడు. AE నిర్లక్ష్యంతోనే తిరుపతి చనిపోయాడని  ఆరోపిస్తూ గ్రామస్తులు సిద్దిపేట హైవేపై రాస్తారోకో చేశారు. హెల్పర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Updates