పొట్టలో 246 కొకైన్ ప్యాకెట్లు..వ్యక్తి మృతి

వీడొక్కడే సినిమా చూశారా? అందులో హీరో ఫ్రెండ్‌‌ డ్రగ్స్‌‌ను స్మగ్లింగ్‌‌ చేసేందుకు కొకైన్‌‌ పాకెట్లను మింగి కడుపులో దాస్తాడు. అయితే, ఓ పాకెట్‌‌ చినిగిపోయి పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. అచ్చం అలాగే జపాన్‌‌కు చెందిన ఉడో ఎన్‌‌ అనే వ్యక్తి కొకైన్‌‌ పాకెట్లను మింగాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 264 పాకెట్లు. అధికారుల కన్నుగప్పుదామని భావించిన అతడు.. చనిపోయాడు.

విమానం ఎక్కి సీట్లో కూర్చున్నాక అన్ని పాకెట్లు ఉండేసరికి పొట్ట ఒత్తిడికి గురై ఒక పాకెట్‌‌ పగిలిపోయింది. పెద్ద మొత్తంలో కొకైన్‌‌ రక్తంలో కలిసిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొలంబియా రాజధాని బొగోటా నుంచి జపాన్ రాజధాని టోక్యోకు వెళుతున్న విమానంలో జరిగింది. విమానాన్ని మెక్సికోలోని సొనోరా ఎయిర్‌‌పోర్టులో ల్యాండ్‌‌ చేశారు. పోస్టు మార్టం చేసి ఆ కొకైన్‌‌ పాకెట్లను బయటకు తీశారు.

Latest Updates