లోటస్ పాండ్‌‌లో డెడ్ బాడీ.. మార్నింగ్ వాక్ చేస్తూ కళ్ళు తిరిగి ప‌డి మృతి

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్‌‌లో డెడ్ బాడీ కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంత‌రం మీడియ‌తో మాట్లాడుతూ… లోటస్ పాండ్ లో డెడ్ బాడీ ఉన్నట్లు త‌మ‌కు సమాచారం వచ్చిందని, మార్నింగ్ వాక్ కోసం వచ్చి ప్రమాదవశాతు పడి మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించామ‌ని అన్నారు. మృతుడు బంజారాహిల్స్ IAS కాలానికి చెందిన అహ్మద్ అని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియకు తరలించామ‌ని అన్నారు. అహ్మద్ షుగర్ వ్యాధి తో బాధపడ్తున్నట్టు మృతుడి సోదరుడు చెప్పాడన్నారు. మార్నింగ్ వాక్ చేస్తూ కళ్ళు తిరిగి నీళ్లల్లో పడినట్లు భావిస్తున్నామ‌ని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్లడించారు.

Latest Updates