రెప్పపాటులో కాపాడిండు: హైస్పీడ్‌లో రైలు.. పట్టాలపై యువకుడు

దేవుడిలా… వెంట్రుకవాసిలో లాగేసిన స్టేషన్ అధికారి

చావు అంచులదాకా వెళ్లి రావడం అంటే ఇదేనేమో! ఒక్క సెకన్ ఆలస్యం అయినా శరీరం అంతా ముక్కలు ముక్కలు అయిపోయేది. భూమిపై నూకలు ఉండి.. ఆ దేవుడే వచ్చాడా అన్నట్లు.. రెప్పపాటులోనే ప్రాణం నిలబెట్టాడో వ్యక్తి!! చూసిన వాళ్లందరికీ వెన్నులో వణుకు పుట్టించి.. ఒళ్లంతా క్షణకాలం జిళ్లుమనే ఈ సీన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ రైల్వే స్టేషన్‌లో జరిగింది.

అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలోలోని కొలీజియం రైల్వే స్టేషన్‌ బాగా రద్దీగా ఉంది. ప్లాట్‌ఫామ్‌పై జనాలు ఫుల్‌గా ఉన్నారు. రైయ్య్‌న హైస్పీడ్‌తో ట్రైన్ దూసుకొస్తోంది. క్షణ కాలంలో వచ్చేస్తుందనగా.. ప్లాట్‌ఫాంపై ఉన్న యువకుడు జారి పట్టాలపై పడ్డాడు. కన్నుమూసి తెరిచేంత గ్యాప్ కూడాలేదు. ఆ కొద్ది టైమ్‌లోనే అక్కడే ఉన్న స్టేషన్ అధికారి ఒకరు ఆ యువకుడి చేయిపట్టుకుని లాగేశాడు. క్షణకాలంలో పోయిందనుకున్న ప్రాణం నిలిచిందిరా అని అంతా అతడి వెన్ను తట్టారు. ఈ మొత్తం సీన్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోను శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. అమేజింగ్, సూపర్‌గా సేవ్ చేశారంటూ నెటిజన్లు స్టేషన్ సిబ్బందిని మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Latest Updates