19 ఏళ్ల కిందటి ఫోన్..70% చార్జింగ్ తో దొరికింది

ఈరోజుల్లో తమ చేతిలోని స్మార్ట్ ఫోన్ ను కనీసం 2, 3 సార్లైనా చార్జింగ్ పెట్టకుండా ఉండలేరు చాలామంది. వారి వాడకం ఆ రేంజ్ లో ఉంటుంది మరి. మాట్లాడుకోవడానికి తయారైన ఫోన్… టెక్నాలజీతో పాటు అప్ గ్రేట్ అయి స్మార్ట్ ఫోన్ అవతారంలో అందరిచేతుల్లోకి వచ్చేసింది. ఐనప్పటికీ బ్యాటరీ అనేది మాత్రం ఇప్పటికీ అందరికీ పెద్ద సమస్యే. ఇందుకోసం పవర్ బ్యాంకులను పట్టుకుని తిరుగుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో ఇంగ్లండ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ వండర్ అనిపిస్తోంది.

ఇంగ్లండ్ లోని ఎలెస్ మియర్ పోర్ట్ సిటీలో కెవిన్ మూడీ అనే వ్యక్తికి ఎదురైన ఈ సర్ ప్రైజింగ్ అనుభవం.. ఇపుడు వార్తగా చక్కర్లు కొడుతోంది. అతడు కన్ స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. మరిచిపోయిన ఓ వస్తువు కోసం.. ఇటీవలే అతడు.. ఇంట్లో అంతా వెతికాడు. ఓ టేబుల్ డ్రాలో… మూలన .. నోకియా పాత మోడల్ 3310 మోడల్ ఫోన్ దొరికింది. అరె.. ఈ ఫోన్ ఇంకా ఉందా అని అతడు కాస్త ఆనందంగా ఆ ఫోన్ ను చెక్ చేశాడు. ఫోన్ ఆన్ అవ్వడమే కాకుండా… 70 పర్సెంట్ బ్యాటరీని చూపించింది. వావ్ అనుకుని.. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు కెవిన్ మూడీ.

19 ఏళ్ల కిందట.. 2000 ఏడాదిలో ఈ ఫోన్ కొన్నానని చెప్పాడు కెవిన్. అప్పట్లో ఈ ఫోన్ ను బాగా ఉపయోగించేవాడిననీ… కొత్త ఫోన్లు రావడంతో..  దానిని పక్కన పెట్టినట్టు చెప్పాడు. కొన్నేళ్లనుంచి పూర్తిగా వాడటం మానేశానని చెప్పాడు. సిమ్ లేని ఆ ఫోన్ … స్విచ్చాఫ్ కాకుండా 70శాతం చార్జింగ్ తో ఇంకా ఉండటం సర్ ప్రైజింగ్ గా ఉందని అన్నాడు. బ్యాటరీ విలువేంటో చెప్పిందన్నాడు కెవిన్.

Latest Updates