ఇంటిముందు పడుకుంటే.. తల నరికి తీసుకుపోయాడు

ఘోరం. వార్త వింటేనే దారుణమనిపించే న్యూస్ ఇది. ఒడిశాలో జరిగింది ఈ ఒళ్లు గగుర్పొడిచే నేరం.

ఒడిశాలోని సంబాల్ పూర్ లో ఓ వ్యక్తి ఇంటి ముందు పడుకుని ఉన్నాడు. తెల్లారేసరికి అతడు చనిపోయి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఐంతపాలిన్ స్టేషన్ పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి వచ్చి పంచనామా చేశారు. వారు డెడ్ బాడీని గుర్తించారు. ఐతే.. ఆ బాడీకి తల లేదు.

ఇంటి ముందు మంచంపై పడుకున్న 55 ఏళ్ల వ్యక్తిని తల నరికి గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారని.. తర్వాత ఆ తలను తీసుకుపోయారని పోలీసులు చెప్పారు. తలను తీసుకుపోయినవారు ఎవరు.. ఆ తల ఎక్కడుంది అనేదానిపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని సంబాల్ పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా చెప్పారు. ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.

Latest Updates