బోర్డర్ దాటాలని డాష్ బోర్డులో దూరారు

దేశ సరిహద్దులు దాటి యూరప్​లోకి చేరాలన్న ఓ వ్యక్తి ఆరాటానికి ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. కార్లో డాష్​బోర్డుకు చిన్నచిన్న వస్తువులు పెట్టుకునే బాక్స్​ ఉంటుంది కదా. ఆ బాక్సులోకి దూరేసి బోర్డర్​ దాటే ప్రయత్నం చేశారు ఆఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు. మే 24న మొరాకో, మెలిలా మధ్య బెని–ఎంజర్​ సరిహద్దుల వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు వాళ్లు డాష్​బోర్డులో దూరి ప్రయాణం చేస్తున్నట్టు గుర్తించారు. వారిని పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు పరుపుల్లో దూరి కూడా దేశం దాటాలని చూశారు. ఉత్తర ఆఫ్రికా, మెలిలా, క్యూటాకు చెందిన వేలాది మంది మెరుగైన జీవితం కోసం స్పెయిన్​లోకి అక్రమంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Latest Updates