వాట్సాప్ వాయిస్ మెసెజ్ ద్వారా ట్రిపుల్ తలాఖ్

వాట్సాప్ ద్వారా తన భర్త తనకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్ లో ఉంటున్న అతను వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తనకు ఆ సందేశాన్ని పంపాడని పోలీసుల ఎదుట తెలిపింది. వివరాల్లోకి వెళితే..  కర్ణాటక లోని శివమొగ్గకు చెందిన ముస్తాఫా బేగ్ అనే వ్యక్తి అదే నగరానికి చెందిన ఓ మహిళని 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. నగరంలో ల్యాప్ టాప్, సీసీ కెమెరా ల టెక్నిషియన్ గా పనిచేస్తున్న అతను… కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం భార్య పిల్లలను విడిచి దుబాయ్ వెళ్లాడు.

అక్కడే ఉద్యోగం సంపాదించిన ముస్తాఫా ఇంటి ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల తన భార్యకు రూ.13,000 పంపించేవాడు.  సంవత్సరానికి రెండు సార్లు తన భార్య పిల్లలను చూసేందుకు సొంతూరికి వచ్చేవాడు. ఈ ఏడాది జనవరి న కూడా తన భార్య, కూతుర్ని  చూసేందుకు వచ్చిన ముస్తాఫా తిరిగి దుబాయ్ వెళ్లాక.. ఇంటికి డబ్బులు పంపించడం మానేశాడు. ఫోన్ చేయడం మానేశాడు. కొన్ని రోజుల క్రితం అతని భార్యకు వాట్సాప్ ద్వారా త్రిపుల్ తలాఖ్ ఇవ్వడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తమ వివాహ బంధం రద్దు కానివ్వొద్దు అంటూ తన బాధ చెప్పుకుంది. పోలీసులు మాత్రం తన భర్త దుబాయ్ లో ఉండటం వల్ల తామేమీ చేయలేమని చెప్పారంటూ ఆమె మీడియాకి తెలిపింది.

Man gives triple talaq to wife in Shivamogga through Whatsapp from Dubai

Latest Updates