కూతురును సుత్తెతో కొట్టి చంపిన తండ్రి…

మహారాష్ట్ర: సొంత కూతురునే సుత్తెతో మోది చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం విరార్‌ ప్రాంతంలో దత్తారాం జోషి(54) అనే వ్యక్తి తన 20 సంవత్సరాల కుమార్తెను అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. కానీ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తిరుపతి నగర్‌లో స్థానికంగా ఉన్న  కళాశాలలో బీఎస్సీ చదువుతున్న కుమార్తె ఆకాంన్షను దత్తారాం తన భార్య, కొడుకు ఇంట్లో ఉన్న సమయంలోనే సుత్తెతో తలపై బలంగా కొట్టి చంపాడు.

అయితే  ఇంట్లో వారు మాత్రం పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలజడితో హత్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి అమ్మాయి చనిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. జోషి తన కూతురును ఎందుకు చంపాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఆ వ్యక్తి తన కుమార్తెను ఎందుకు హత్య చేశాడన్న విషయం చెప్పడం లేదు. దీంతో ఇతర మార్గాల్లో కేసును విచారణ చేస్తున్నారు పోలీసులు.

Latest Updates