పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న యువకుడు

సుమారు 25-30 సంవత్సరాల వయస్సున్న ఒక యువకుడు పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న ఘటన ముంబైలోని గుండ్వాలిలో జరిగింది. అంధేరిలోని గుండ్వాలి గావ్ మసీదు ఎదురుగా ఉన్న ఒక పబ్లిక్ టాయిలెట్‌లో ఈ యువకుడు చనిపోయాడు. యువకుడు టాయిలెట్ గదిలో చనిపోయినట్లు రాత్రి 7 గంటల సమయంలో టాయిలెట్ సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన యువకుడు వెర్సోవాకు చెందిన షహనావాజ్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. యువకుడు నైలాన్ తాడుతో టాయిలెట్‌లో సూసైడ్ చేసుకున్నాడని.. అతని దగ్గర ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సూసైడ్‌కు గల కారణాలు వెతికే పనిలో పడ్డారు.

For More News..

ఆటలో గొడవ.. 8 మంది ఖైదీలు మృతి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

నలుగురు యువకులు.. ఓ బాలికను..

Latest Updates