ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

హైదరాబాద్,వెలుగు: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడిని రెయిన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం..యాకుత్ పుర సెగ్మెంట్ లోని డబీర్ పుర బస్తీకి చెందిన షేక్ చాంద్‌(-26) అదే బస్తీకి చెందిన ఓ యువతి(19)ని కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబీకులకు విషయం చెప్పింది. ఆ యువతి తల్లిదండ్రులు శనివారం రెయిన్ బజార్ పీఎస్ లో కంప్లయింట్ చేయగా..షేక్ చాంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించామని సీఐ చెప్పారు.

మరో ఘటనలో

యాకుత్ పుర సెగ్మెంట్ లోని బడా బజార్ బస్తీకి చెందిన మహ్మద్ నీసారుద్దీన్(38)కి సూర్యజంగ్ దేవుడి బస్తీకి చెందిన ఓ మహిళ(34) పదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలకున్నారు. ఇటీవల  దుబాయ్ వెళ్లిన నీసారుద్దీన్ జులైలో సిటికీ వచ్చాడు. ఆ మహిళ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా..అతడు నిరాకరించాడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. రెయిన్ బజార్  పోలీసులు నీసారుద్దీన్ ను  అరెస్ట్ చేశారు.

Latest Updates