ఫోటోలు మార్ఫ్ చేసి బ్లాక్ మెయిల్.. పోకిరి అరెస్ట్

ఢిల్లీ: మహిళల ఫొటోలను మార్ఫ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రానికి చెందిన సుమిత్‌ ఝా(26) అనే వ్యక్తి మొదట మహిళల సోషల్‌ మీడియా అకౌంట్‌ ప్రొఫైల్‌ ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి.. ఆ తరువాత వాటిని మార్ఫ్‌ ‌ చేసేవాడు. తర్వాత సేమ్‌ సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి.. ఆ ఫోటోలను ఆ మహిళలకే పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు.ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఇలాగే బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బ‌య‌ట‌ప‌డింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయ‌గా.. ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ సౌకర్యంతో సుమిత్ ఝా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. అత‌నిపై ఢిల్లీ సైబర్‌ సెల్‌ పూర్తిస్థాయి విచారణను చేపట్టి నిందితుడిని గుర్తించి అరెస్టు చేసింది. నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్‌, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates