భార్యపై గొడవపడి 21 రోజుల పసికందును చంపాడు

భార్యతో గొడవపడి ఓ వ్యక్తి తన 21 రోజుల కుమార్తెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీ నగరం ద్వారకలోని బిందాపూర్ లో జరిగింది. తన భర్త ముఖేష్(26) ఈ హత్య చేసినట్టు ఆ చిన్నారి తల్లి కిరణ్ (23) పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ప్రసవం తరువాత తాను ఈ శుక్రవారం తన పుట్టింటికి వెళదామనకున్నానని, అందుకు తన భర్త అంగీకరించకని తనతో గొడవపడ్డాడని తెలిపింది. ఆ తర్వాత అతను పాపను మేడ మీద గదికి తీసుకెళ్ళి హత్య చేసినట్టు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

పాపను గదిలోకి తీసుకెళ్లిన కొద్దిసేపటి తర్వాత గదిలోకి వెళ్లి చూడగా  ఆ శిశువు మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి తన భర్తను నిలదీశానన్నారు. తానే గొంతు కోసి చంపానని, ఆ తరువాత నీటి తొట్టెలో ముంచి వేసినట్లు ముఖేష్ చెప్పాడని ఆమె తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న శిశువును ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆ పాప అప్పటికే చనిపోయందని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదికలో మొదట చిన్నారి గొంతు కోసి, ఆ తరువాత నీటి ముంచి చంపేసినట్టు వెల్లడైంది.  ఈ ఘటనకు కారణమైన ముఖేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వారు తెలిపారు.

Man held for killing 21-day-old daughter in Delhi

Latest Updates