10బీర్లు తాగి..యూరిన్ కి వెళ్లలేదు.. ఆ తరువాత ఏమైందంటే

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయినా సరే రకరకాల కారణాల వల్ల మద్యం సేవించి అనారోగ్యాల పాలవుతుంటారు. నార్మాల్ గా మందు తాగడమే తప్పు అదే స్థాయికి మించి తాగితే ఏమవుతుంది. ప్రాణం మీదకు తెచ్చుకోవాల్సి వస్తుంది.

అలా చైనాకు చెందిన 40ఏళ్ల హూ ఓ రోజు రాత్రి 10బీర్లు తాగాడు. తాగిన తరువాత యూరిన్ కు వెళ్లాల్సి ఉంది. కానీ మత్తులో యూరిన్ కు వెళ్లకుండా 18గంటలు పడుకున్నాడు. 18గంటల తరువాత కడుపులో తీవ్రంగా నొప్పిరావడంతో..ఆ నొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. అన్నీ వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాధితుడి మూత్రాశయం పగిలిపోయిందని చావుకబురు చల్లాగా చెప్పారు. ప్రాణాలకు ప్రమాదం లేకున్నా మద్యం తాగిన వెంటనే యూరిన్ కు వెళ్లాలని, లేదంటే తాగిన మద్యం మూత్రాశాయంలోకి వెళ్లి ప్రమాదాన్ని కలిగిస్తుందని డాక్టర్లు చెప్పారు.

Latest Updates