అమెరికాలో కర్ణాటక వ్యక్తి మృతి

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు చెందిన నందిగం మణిదీప్‌ అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మ‌ణిదీప్ మృతి గురించి అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. అయితే అతని మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. త‌మ కుమారుడి మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని మ‌ణిదీప్ పేరెంట్స్ డిమాండ్ చేశారు.

క‌ర్ణాట‌క క‌స్తూర్బా మెడిక‌ల్ కాలేజీలో మ‌ణిదీప్ MBBS పూర్తి చేశాడు. మూడేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోసం  న్యూజెర్సీ వెళ్లాడు. అక్క‌డ సెయింట్ పీట‌ర్స్ యూనివ‌ర్సిటీ ఆస్పత్రిలో ప‌నిచేస్తున్నాడు. మ‌ణిదీప్ భౌతిక‌దేహాన్ని భార‌త్‌కు పంపించేందుకు ఎంబ‌సీతో తానా ట‌చ్‌లో ఉన్న‌ట్లు ఒక‌రు తెలిపారు.

 

Latest Updates