గుంటూరులో మహిళ దారుణ హత్య

man-killed-a-woman-in-guntur-duggirala

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణం జరిగింది. పద్మావతి అనే మహిళను సుబ్బారెడ్డి అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. గాంధీనగర్‌ నివాసి అయిన సుబ్బారెడ్డి, చెన్నకేశవ్‌నగర్‌కి చెందిన పద్మావతి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో.. పద్మావతిపై అనుమానం పెంచుకున్న సుబ్బారెడ్డి, ఆమెను హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. హత్య అనంతరం అక్కడినుంచి పారిపోతున్న సుబ్బారెడ్డిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Latest Updates