బావను చంపిన బావమరిది అరెస్ట్

చెల్లెలిని వేధిస్తున్నాడని బావను తండ్రితో కలిసి దారుణంగా హతమార్చిని బావమరిదిని దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్​చేశారు. సీఐ వెంకటేషంతో కలిసి పేట్​బషీరాబాద్​ ఏసీపీ మీడియాకు వివరాలు  వెల్లడించారు. ఐడీపీఎల్​కాలనీ గురుమూర్తినగర్​కు చెందిన షేక్​ అమీర్(25) గాజులరామారం కైసర్​నగర్​కు చెందిన మరూఫ్​పటేల్ కుమార్తె హీనా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడు నెలల కుమార్తె ఉంది. 15 రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో తన కుమార్తెను తీసుకొని హీనా పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 11న వాళ్లను చూడడానికి కైసర్​నగర్​లోని అత్తగారింటికి అమీర్​వెళ్లాడు. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవతో కోపోద్రిక్తుడైన హీనా సోదరుడు ఇస్మాయిల్​తన తండ్రితో షేక్​మరూఫ్​పటేల్​తో కలిసి డంబెల్స్​తో దాడి చేశాడు. అమీర్​కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందులను ప్రగతినగర్​ క్రాస్​రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ఏటీఎం చోరీ కేసులో…

ఏటీఎం సెంటర్​లో చోరీ చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను దుండిగల్​ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భౌరంపేట్​కు చెందిన ఎండీ షాకీర్​(30) ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్నాడు. సంగారెడ్డి రామ్​నగర్​కు చెందిన  రమేష్ కుమారుడు సాయి విక్రమ్​(23) సెంట్రింగ్​ పనిచేస్తుంటాడు. వీరిద్దరు ఈ నెల 12న వేకువజామున 2.30 గంటల సమయంలో మద్యం తాగి సూరారంలోని ఓం జెండా వద్ద ఉన్న యాక్సిస్​ బ్యాంక్​ ఏటీఎంలోకి వెళ్లారు. రాడ్డు, స్క్రూ డ్రైవర్​తో క్యాష్​ కవర్​ను ధ్వంసం చేశారు.  అక్కడ జనాలను చూసి కొద్ది దూరంలో ఉన్న బీఓఐ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లి అందులో క్యాష్​ కవర్​ను ధ్వంసం చేసి డబ్బులు దొంగలించేందుకు యత్నించారు. అటువైపు వస్తున్న వారిని చూసి అక్కడినుండి పరారయ్యారు. దుండిగల్ పెట్రోలింగ్​ సిబ్బంది సూరారం క్రాస్​ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా షాకీర్​, సాయి విక్రమ్​పట్టుబడ్డారని ఏసీపీ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్​ఐ శంకర్​రెడ్డి ఉన్నారు.

Latest Updates