కరెంట్​ తీగలకు నిండు ప్రాణం బలి

రాయపర్తి, వెలుగు: పొలంలో కలుపు మందు కొడుతున్న వ్యక్తి, కిందకు వేలాడుతున్న కరెంట్​ తీగలు తగిలి చనిపోయాడు. వరంగల్​ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్​నగర్​ గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు (26)కు అదే ఊరికి చెందిన రాధికతో కొన్నాళ్ల కిందట పెళ్లయింది. ఉన్న ఎకరం పొలంలో పంట వేసినా గిట్టుబాటు కాలేదు. హైదరాబాద్​ వలసెళ్లి అక్కడ కూలీ పనిచేశాడు. చాలీచాలని డబ్బులతో కుటుంబం గడవడం కష్టమైంది. దీంతో మళ్లీ ఊరికి తిరిగొచ్చాడు.

ఉన్న పొలంలోనే పంట వేసి, కూలి పనులకూ వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంటికి సమీపంలోనే ఉండే ఎల్లయ్యే అనే వ్యక్తి పొలంలో కలుపు మందు కొట్టేందుకు వెళ్లాడు. పొలంలో  చేతికి అందే ఎత్తులోనే కరెంట్​ తీగలు ఉన్నాయి. మందు కొడుతున్న క్రమంలో కిందికి వేలాడిన ఆ తీగలు తగిలి రాజు చనిపోయాడు.

Latest Updates