జీతం డ‌బ్బులు అడిగింద‌ని భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

హైద‌రాబాద్: న‌గ‌రంలోని కుషాయిగూడ‌లో దారుణం జ‌రిగింది. జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. ఏఎస్​ రావు నగర్​, కాప్రాలో నివాస‌ముంటున్న సంతోష్​ చౌహాన్.. ప‌ర‌మేశ్ పాటిల్ అనే వ్యాపారి ద‌గ్గ‌ర ప‌నిచేసే వాడు. అయితే గ‌త రాత్రి జీతం డ‌బ్బుల విష‌య‌మై అతని భార్య దీపాలి చౌహాన్​ తో గొడ‌వ‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో దీపాలి త‌న భర్త‌పై కోపంతో కిచెన్ లో ఉన్న పట్టుకారును అత‌నిపై విసిరింది. ఆగ్ర‌హ‌వేశాల‌కి లోనైన సంతోష్​ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు. కొంతసేపటికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు ఫోన్​ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్​ యజమాని పరమేష్​ కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించాడు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సంతోష్​ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest Updates