చాటింగ్ చేస్తోందని భార్య హత్య

man-killed-his-wife-in-peddapalli-district

గోదావరిఖని, వెలుగు : అనుమానంతో భార్యను హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్ కు చెందిన దుర్గం శ్రావణ్ జీఎం కాలనీకి చెందిన మౌనిక(28)ను పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు అక్షయ్(8) , నిక్షయ్(6). ఏ పని లేకుండా తిరిగే శ్రావణ్ అదనపు కట్నం కోసం మౌనికను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గతంలో జరిగిన గొడవల్లో మౌనిక చేయి విరగగా తల్లిదండ్రులు చికిత్స చేయించారు.తాజాగా గురువారం మౌనిక సెల్​కు ఎవరో ఫోన్ చేశారని, మెసేజ్ వచ్చిందని, చాటింగ్ చేసిందంటూ గొడవకు దిగాడు. విషయం తెలుసుకున్న మౌనిక తల్లి-దండ్రులు, సోదరుడు వచ్చి శ్రావణ్ ను మందలించారు. ఇక నుంచి బాగానే ఉంటామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం 2.30 గంటల సమయంలో శ్రావణ్ ఇనుప రాడ్ తోమౌనిక తలపై బలంగా కొట్టి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని నేరుగా గోదావరిఖని వన్టౌన్ పోలీస్​స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు

Latest Updates