ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి : ఆర్టీసీ బస్సు ఢీకొని వద్ధుడు(80) మరణించిన సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి బస్టాండ్ దగ్గర వృద్ధుడు రోడ్డు దాటుతుండగా..యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు డీకొట్టింది. గాయాలైన అతడిని వెంటనే స్థానిక ఏరియా హస్పిటల్ తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని భువనగిరి మండలం సురేపల్లి గ్రామానికి చెందిన వంగూరి లచ్చయ్య గుర్తించిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates