హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. అంబర్ పెట్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం బైక్ ను ఆర్టీసీ సిటీ బస్ ఢీకొట్టడంతో  బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు అంబర్ పెట్ నుండి రామంతపుర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాన్ని  ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Latest Updates