ప్రేయసిని హత్య చేసి ఇంట్లోని గోడలో దాచిండు

ఓ వ్యక్తి తన ప్రేయసిని హత్య చేసి ఇంట్లోని గోడలో దాచిపెట్టాడు ఆ మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహారాష్ట్ర పాల్ గడ్ జిల్లాలోని వనగామ్ గ్రామంలోఈ దారుణం జరిగింది…అసలు ఏం జరిగిందంటే..నిందితుడు  5 ఏళ్లుగా ఓ 32 ఏళ్ల మహిళతో ఉంటున్నాడు.అయితే కొన్ని రోజులుగా ఆ మహిళ కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీశారు.  ఆమె గుజరాత్‌లోని వాపికి వెళ్లిందని నిందితుడు చెప్పాడు. ఆ మహిళా తిరిగి రాకపోవడంతో వారు చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మహిళతో సహజీవనం చేసిన అతడిని అరెస్ట్ చేశారు.దీంతో అసలు విషయం బయటపడండి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను హత్యచేసినట్లు చెప్పాడు. మృతదేహాన్ని తన ఫ్లాట్ లోని గోడలో దాచిపెట్టానని చెప్పాడు. దీంతో పోలీసులు ఫ్లాట్ లోని గోడను తవ్వడంతో  మృతదేహం  దాదాపు అస్థిపంజరంగా బయటపడింది. ఆమె  గతేడాది అక్టోబర్ లో హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

see more news

సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

ఏపీ, తెలంగాణ.. ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలి

 

Latest Updates