మాట్లాడుకుందామని తీసుకెళ్లి ప్రాణం తీశాడు

  • నమ్మించి కర్చీఫ్‌తో గొంతు బిగించి చంపేశాడు
  • ఉన్మాది ఘాతుకానికి యువతి బలి
  • ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి గుట్టల్లో దారుణం

పెనుబల్లి, వెలుగుసత్తుపల్లిలోని ద్వారకానగర్‌కు చెందిన నితిన్ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేస్తున్నాడు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన తేజస్వి డిప్లొమా చేసింది. మూడేళ్ల కింద వీరు కుప్పెనకుంట్లలో పాలిటెక్నిక్‌ చేశారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ప్రేమగామారింది. డిప్లొమాలో తేజస్వికి రెండు సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌ ఉండడంతో ఏడాదిగా ఇంటి వద్ద  ఉంటోంది. నితిన్ ఖమ్మంలో ఇంజినీరింగ్‌ చేస్తూ హాస్టల్‌లో ఉంటున్నాడు.

ఏడాదిగా దూరదూరంగా ఉంటుండడంతో యువతి బంధువైన మరో వ్యక్తితో చనువుగా వుంటోందని అనుమానిస్తూ నితిన్‌ తరచూ తేజస్విని ఫోన్‌లో వేధించేవాడు. ఈనెల 25న ఆదివారం సాయంత్రం కుప్పెనకుంట్ల వచ్చిన నితిన్‌ మాట్లాడాలని ఆమెను బైక్‌పై ఎక్కించుకొని పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి గ్రామంలోని గుట్టల వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవ పడిన నితిన్​ కర్చీఫ్‌తో గొంతు చుట్టూ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. మృతదేహాన్ని కాల్చడానికి రెండు లీటర్ల పెట్రోల్, ఒక లీటర్ కిరోసిన్ తీసుకొచ్చాడు. అయితే అదే సమయంలో అక్కడ లారీలు ఆగడంతో బైక్ వదిలేసి పరారయ్యాడు.  కూతురు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తేజస్వి తండ్రి కె. సత్యనారాయణ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొత్త లంకపల్లి గుట్టల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ వెతకగా మంగళవారం తేజస్వి మృతదేహం లభ్యమైంది. క్లూస్ టీమ్ ఘటనా స్థలం వద్ద పెట్రోల్, కిరోసిన్​ బాటిళ్లు, సిమ్ కార్డు, బైక్‌ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు నితిన్‌ను త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు

Latest Updates