మొబైల్ అడిగితే ఇవ్వలేదని చంపేశాడు

మహారాష్ట్ర: చిన్న గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. తాగిన మైకంలో భార్యను దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ముంబైలో జరిగింది.
వివరాలు: ముంబై శివారులోని చెంబూర్ సబర్బన్ ప్రాంతానికి చెందిన జేమ్స్ జాన్ కురయ్య(51)కి ఇంతకు ముందే మొదటి భార్య గొడవపడి వెళ్లిపోవడంతో.. మరో మహిళ(45)ను పెళ్లి చేసుకున్నాడు. అయితే నిత్యం తాగి వచ్చి గొడవ చేసే కురయ్య.. ఆదివారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు.

ఇంట్లోకి వచ్చిన కొంత సేపటికి భార్యను పిలిచి, ఆమె సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగాడు.  ఆమె ఇవ్వనని చెప్పడంతో ఒక్కసారిగా మండిపడ్డాడు. ఇష్టమొచ్చినట్టుగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఎదురుచెప్పే సరికి తట్టుకోలేక ..వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. భార్యను హత్య చేసిన తర్వాత జాన్ పారిపోవడానికి ప్రయత్నించాడు.

అయితే స్థానికులు, ఇరుగుపొరుగున ఉండే బంధువులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు స్థానికులు పూర్తి వివరాలు తెలిపారు. కురయ్య మొదటి భార్య సమీపంలోని మాన్ ఖుర్ద్ ప్రాంతంలో ఉంటున్నట్టు తెలిపారు. దీంతో  జాన్ కురయ్యపై  హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు ముంబై పోలీసులు.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

Latest Updates