ట‌చ్ చేయ‌కుండా బామ్మ‌ను హ‌గ్ చేసుకోవ‌డానికి యువ‌కుడి టెక్నిక్: ఆనంద్ మ‌హింద్రా ఫిదా

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంట్లో వాళ్ల‌ను ఆత్మీయంగా హ‌గ్ చేసుకోవాల‌న్నా.. భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఏదైనా ప‌ని మీద‌ బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తే ఎక్క‌డైనా వైర‌స్ అంటుకుని ఉంటుందేమో అన్న అనుమానం‌తో కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా దూరంగా దూరంగా ఉండాల్సి వ‌స్తోంది. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌కున్నా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అంటుకునే ప్రమాదం ఉండ‌డంతో మ‌న ఆత్మీయులు ఎక్క‌డ వైర‌స్ బారిన‌ప‌డుతారోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ కు చెందిన ఓ యువ‌కుడు త‌న బామ్మ‌ను హ‌గ్ చేసుకోవ‌డానికి వినూత్నంగా ఆలోచించాడు. ట‌చ్ చేయ‌కుండా ఆత్మీయంగా కౌగిలించుకునేందుకు ఓ వైర‌టీ క‌ర్ట‌న్ రూపొందించాడు. ఇంగ్లండ్ లోని స్ట్రాట్ ఫోర్డ్ లో ఉండే ఆంటోనీ అనే యువ‌కుడు గ్లౌజ్ ల‌తో కూడిన‌ పాలిథీన్ క‌ర్ట‌న్ ను ఇంటి ముందు వేలాడ‌దీసి.. ఒక‌రినొక‌రు నేరుగా తాక‌కుండా హ‌గ్ చేసుకునేలా దీన్ని డిజైన్ చేశాడు. త‌న బామ్మ‌ను హ‌గ్ చేసుకోవ‌డాన్ని వీడియో తీసి.. మే 15న ఆంటోనీ భార్య మైరియం త‌న ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

Introducing… ‘The Cuddle Curtain’ 💕😍❤️

Posted by Miriam Cauvin on Friday, May 15, 2020

వీడియో వైర‌ల్.. లైఫ్ చేంజింగ్ ఇన్వెన్ష‌న్ అన్న ఆనంద్ మ‌హింద్రా

ఐదు రోజుల్లోనే ఈ వీడియోను 55 ల‌క్ష‌ల మంది చూశారు. 78 వేల మందికి పైగా లైక్ చేయ‌గా.. 2 ల‌క్ష‌ల మంది షేర్ చేశారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజ‌న్లు ఎమోష‌న‌ల్ గా కామెంట్లు చేశారు. ఈ వీడియో కంట‌త‌డి పెట్టించింద‌ని చాలా మంది కామెంట్ చేశారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఈ వీడియో ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హింద్రాను ఆక‌ట్టుకుంది. క‌రోనా వ్యాక్సిన్ కోసం అంతా ఎలా ఎదురు చూస్తున్నారో.. కుటుంబంలో పెద్ద‌లు కూడా పిల్ల‌లను ఆత్మీయంగా హ‌గ్ చేసుకోవాల‌ని అలానే వెయిట్ చూస్తున్నారంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ డివైజ్ త‌యారు చేయ‌డానికి నోబెల్ ప్రైజ్ విన్న‌ర్ అక్క‌ర్లేద‌ని, అయితే ఫ్యామీలీ మెంబ‌ర్స్ తో ఇలా సేద‌తీరాల‌నుకునే పెద్ద‌ల‌కు మాత్రం ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఇన్వెన్ష‌న్ లాంటిదేన‌ని అన్నారు.

Latest Updates