వైరల్ వీడియో: ఇద్దరమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు

చత్తీస్ ఘడ్ లో జరిగిన ఓ పెళ్లి వైరల్ అవుతోంది. ఏస్పెషల్లీ యూత్ అంతా ఆ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకేసారి ఇద్దరికి తాళి కట్టి వార్తల్లోకి వచ్చాడు .బస్తర్  జిల్లాలోని జగదల్పూర్ లో కూలీ పనులు చేసుకునే చందు మౌర్య ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ప్రేమించాడు. వారు కూడా  చందూను ప్రేమించారు. పెళ్లి సమయానికి వచ్చే సరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కానీ చందు ఇద్దరమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు.  ఇంకేముంది ఇకే పెళ్లి పందిట్లో ఇద్దరమ్మాయిలకు తాళి కట్టాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెళ్లి గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.

Latest Updates