వేములవాడలో కత్తిదాడి కలకలం

man-murder-attack-in-vemulawada

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కత్తిదాడి కలకలం రేపింది. వేములవాడలో రాజు అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడలో 3వ వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ సోదరుడు రాజుగా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విజయ్ పై కౌన్సిలర్ గా పోటి చేసి ఓడిన సుల్తాన్ శేఖర్ కత్తితో దాడి చేశాడని బాధితుడి వాంగ్మూళంతో  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మున్నిపల్ ఎన్నికలే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే హత్యయత్నంకు పాల్పడిన శేఖర్ ఇంటి వద్దనే శేఖర్ పై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ పుటేజ్ రికార్డ్ అయ్యాయి.

Latest Updates