భార్య‌పై అనుమానంతో హ‌త్య.. ఆపై ఆత్మ‌హ‌త్య

హైదరాబాద్: న‌గరంలోని ‌బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జ‌రిగింది. భార్య‌పై అనుమానంతో ఓ వ్య‌క్తి ఆమెను హ‌త్య చేసి, ఆపై తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప‌టేల్ న‌గ‌ర్ లో నివాస‌ముంటున్న షబ్బీర్ (35),రూబీన బేగం ( 30) దంప‌తుల‌కు న‌లుగురు పిల్ల‌లు. గ‌త కొంతకాలంగా భార్యాభ‌ర్త‌లు మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో గొడ‌వ‌లు ముద‌ర‌డంతో రూబీన పై అనుమానం‌ పెంచుకొని శుక్ర‌మారం మ‌ధ్యాహ్నం ష‌బ్బీర్ ఆమెను హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విష‌యం తెలుసుకున్న బేగంబ‌జార్ పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని కేసు న‌మోదు చేసుకున్నారు. ఇద్ద‌రి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనతో నలుగురు చిన్న పిల్లలు అనాధలుగా మారారు. భార్య, భర్త ల మధ్య కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు గల కారణాలని పోలీసులు వెల్లడించారు.

Latest Updates