ప్రియురాలితో పెళ్లికి ఒప్పులేదని తల్లిని చంపిన కసాయి కొడుకు

నవ మాసాలు కనీ పెంచిన తల్లిని ప్రియురాలి కోసం కడతేర్చాడో కసాయి కొడుకు. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని జగదీష్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వైశాలీ నగర్ కు చెందిన శివం శర్మ, రాణిలు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో శివం శర్మ తన తల్లి బంగారం పై కన్నేశాడు. తల్లి బంగారం కాజేస్తే ప్రియురాలిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వొచ్చని కుట్రపన్నాడు. పథకం ప్రకారం మార్చి 6న బంగారం కావాలని తల్లిని అడిగాడు. బంగారం ఇస్తే తన ప్రియురాలైన రాణిని పెళ్లి చేసుకుంటానని  బెదిరించాడు. కొడుకు బెదిరింపులతో భయాందోళనకు గురైన బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆమె కొడుకు శివం శర్మకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఓ వైపు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని కోపం, రాణితో పెళ్లికి ఒప్పుకోలేదని, బంగారం లేకపోతే ప్రియురాలితో సుఖంగా ఉండలేమోనన్న అనుమానం. వెరసీ మార్చి 6న సాయంత్రం ఇంట్లో మంచంపై పడుకున్న బాధితురాల్ని కొడుకు శివరాం, అతని ప్రియురాలు రాణిలు దిండుతో  కడతేర్చారు.

స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలిచారు. మృతికి కారణమైన శివరాం, రాణిలను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates