ఆపదలో ఉన్నారంటే చాలు.. వెళ్లి కాపాడే యమరాజు

యమపాశంతో ప్రాణాలు తీసుకెళ్లే యమరాజు గురించి పురాణాల్లో కథలు కథలుగా వినుంటాం. కానీ, ఉత్తరాఖండ్​కి చెందిన ఈ యమరాజు మాత్రం తన ప్రాణాలకు తెగించి ఇతరుల్ని ఆపాయం నుంచి గట్టెక్కిస్తున్నాడు. ముప్పైఆరేళ్లుగా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాడు. ఉత్తరాఖండ్​లో ఎవరు వరదల్లో చిక్కుకున్నా, నీళ్లలో కొట్టుకుపోతున్నా మొదటి ఫోన్​ కాల్​ యమరాజుకే వస్తుంది. కాల్ రావడమే ఆలస్యం మరుక్షణం అక్కడికి చేరుకుని రిస్క్యూ మొదలుపెడతాడు. వరదల్లో చిక్కుకున్న వాళ్లని క్షేమంగా ఒడ్డుకు చేర్చుతాడు. 49 ఏండ్లుగా వర్షాకాలంలో వందల మందిని క్షేమంగా వాళ్ల గమ్యాలకు చేరుస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఉత్తరాఖండ్​ అందాల్ని చూడడానికి ఫారిన్​ నుంచి ట్రావెలర్స్​ వచ్చారు. ఆ సంవత్సరం కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. మరీ ముఖ్యంగా యమరాజు సొంతూరు బంగాపాణీ రీజియన్​లో పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఫారినర్స్​ కూడా వరదల్లో చిక్కుకున్నారు. ఊరి నుంచి బయటపడే మార్గం లేదు. సరిగ్గా ఆ టైంలో యమరాజు వాళ్లని గమనించి సాయం చేశాడు. రాత్రంతా వాళ్లని భుజాలపై మోస్తూ ఒడ్డుకు చేర్చాడు. అప్పుడు ఆనందాన్ని చూసిన యమరాజు ఎవరు సాయమడిగినా వరదల నుంచి కాపాడుతున్నాడు వాళ్లు వందోరెండొందలో ఇస్తే నవ్వుతూ తీసుకుంటున్నాడు.

 

 

Latest Updates