ఢిల్లీ జామియా నగర్ లో కాల్పులు

ఢిల్లీ జామియా నగర్ లో కాల్పులు

ఢిల్లీ జామియా నగర్ ఏరియాలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఆజాదీ కావాలా అంటూ రివాల్వర్‌తో బెదిరిస్తూ కాల్పులు జరిపాడు. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) కు వ్యతిరేకంగా జామియా కోఆర్డినేషన్ కమిటీ (JCC) ర్యాలీ నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా విద్యార్థులు చేస్తున్న ర్యాలీని వ్యతిరేకిస్తూ కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడినట్లు సమాచారం. విద్యార్థులు మాత్రం పోలీసులే కాల్పులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు. JCC నిర్వహించిన ర్యాలీ జామియా నగర్ నుంచి రాజ్ ఘాట్ వరకు కొనసాగింది.