మాస్కుపై మత్తు మందు పెట్టి బాలికపై అత్యాచారం

చండీగఢ్: కరోనా రాకుండా ఉండాలంటే మాస్కు పెట్టుకోవాలంటూ ఓ మైనర్ బాలికను నమ్మించిన ఓ కామాంధుడు.. మాస్కుపై మత్తు మందు చల్లి ఇచ్చాడు. మాస్కు పెట్టుకున్న కాసేపటికి బాలిక స్పృహ కోల్పోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లో జరుగగా స్థానికంగా కలకలం రేపింది.  స్థానికంగా ఉండే ఓ లేబర్ కాంట్రాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మొఖానికి వేసుకునే ఓ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని బాలికకు ఇచ్చాడు. విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. ఆ తర్వాత స్పృహ తప్పింది. ఆ సమయంలో కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు  కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Latest Updates