భార్య‌తో గొడ‌వ‌..విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త‌

ఓ విష‌యంలో భార్య‌తో గొడ‌వ‌ప‌డి భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ బ‌రేలీకి చెందిన మునీష్ శ‌ర్మ‌, అత‌ని భార్య మోహిని లు. ఇద్ద‌రు మోర్దాబాద్ సివిలెన్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మునీష్ శ‌ర్మ ఓ హోట‌ల్ మేనేజ‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం ఓ విషయంపై మునీష్ శ‌ర్మ‌కు, మోహిని మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తలెత్తాయి. దీంతో భ‌ర్త‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మోహిని త‌న పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిన రెండు రోజుల త‌రువాత భ‌ర్త విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ఆత్మ‌హ‌త్య‌కు ముందు ఓ వీడియోను రికార్డ్ చేశాడు. పురుగులు మందు తాగి త‌న మ‌ర‌ణానికి భార్య, అత్త‌మామ‌లే కార‌ణ‌మ‌ని అన్నాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఆ వీడియో పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నిందితుల‌పై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates