నెమలిని రక్షించేందుకు ఓ వ్యక్తి చేసిన సాహసం : వైరల్ వీడియో

తమిళనాడు: 30 అడుగుల బావిలో చిక్కుకున్న ఓ నెమలిని రక్షించేందుకు ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ పక్షిని కాపాడినందుకు పలు ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. తిరుచిరపల్లి జిల్లాలోని తురైయూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బావిలో ఇరుక్కుపోయి.. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక ఆ నెమలి అక్కడే ఒడ్డున ఉన్న ఓ రాయిపై కూర్చుంది. అదే బావిలో పాములు కూడా ఉండడంతో నీటిలో మునిగిపోకుండా తన ప్రాణాలు కాపాడుకునే యత్నం చేసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి పక్షిని రక్షించాలని అనుకున్నాడు.  తన నడుముకి తాళ్లు కట్టుకొని మరికొంతమంది యువకుల సహాయంతో బావిలోకి దిగాడు. నెమ్మదిగా ఆ నెమలి వద్దకు చేరుకొని..  ఆ పక్షిని తన చేతుల్లోకి తీసుకొని అంతే నెమ్మదిగా పైకి చేరుకున్నాడు. బావి నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ మయూరాన్ని పక్కనే ఉన్న పొలంలో వదిలిపెట్టగా.. తుర్రుమని అడవిలోకి ఎగిరిపోయింది. అక్టోబర్ నెలలో ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Man risks life using makeshift harness to save drowning peacock from 30ft well in snake infested

Latest Updates