ఇలాంటి తండ్రి ఉండకూడదు..

ముంబై :కూతురిని అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తించాడు. 18 సంవత్సరాల తన కూతురిపై కొన్ని నెలుగా మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన ముంబైలో జరిగింది.

వివరాల్లోకెళితే..

భార్య నుంచి విడిపోయిన 62 ఏళ్ల వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తన మొదటి భార్య కుమార్తెను తన ఇంట్లోనే ఉండాలని కోరాడు. తండ్రి మాటలు విని సవతి తల్లితో కలిసి అతడితోనే ఉండిపోయిన బాధితురాలు… కొద్ది రోజుల నుంచి తనకు తెలియకుండా తనను ఎవరో ఏదో చేస్తున్నారనే అనుమానం వచ్చింది. ప్రతి రోజూ తనకు దగ్గరుండి భోజనం పెట్టే తన తండ్రి… అందులో ఏదో కలిపి తనకు మత్తు వచ్చేలా చేస్తున్నాడని గమనించిన బాధితురాలు… ఒక రోజు బయట భోజనం చేసి యథావిథిగా తన రూముకు వెళ్లి పడుకుంది.

అయితే ఎప్పటిలాగే కూతురిపై అత్యాచారం చేయబోయిన ఆమె తండ్రి… బాధితురాలు అరవడంతో అవాక్కయ్యాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పిన బాధితురాలు… ఆమె సాయంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Latest Updates