లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య.. ముగ్గురి అరెస్ట్

లోన్ యాప్ లతో ప్రజలను వేధిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లపోచంపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి.. ఢిల్లీలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. హర్యానాకు చెందిన హేమంత్.. చైనాకు చెందిన మైకెల్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకుని లోన్ యాప్ డెవలప్ చేసినట్టు ఆమె చెప్పారు. లోన్ తీసుకున్న వారినుంచి 35 నుండి 40 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ 70 వేల రూపాయలు లోన్ తీసుకుంటే.. అతని నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారన్నారు. ఆ తర్వాత కూడా డబ్బులు కట్టాలని వేధించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని డీసీపీ చెప్పారు.

Latest Updates