లోన్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ పై దాడి

లోన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి బ్యాంక్  మేనేజర్ పై దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది.  వెట్రివేల్ అనే వ్యక్తి కోయంబత్తూర్‌ లోని కెనరా బ్యాంక్‌ లో తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయల లోన్ కోసం అప్లై చేసుకున్నాడు.దీని కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోన్ వచ్చేందుకు ఓ  బ్రోకర్ కు రూ. 3 లక్షలు ఇచ్చాడు వెట్రివేల్ . కానీ బ్యాంక్ అధికారులు వెట్రివేట్ లోన్ అప్లికేషన్ ను రిజెక్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వెట్రివేల్  తన దగ్గర ఉన్న కత్తి, తుపాకీతో ఆ బ్యాంక్ మేనేజర్ పై దాడి చేశాడు.  బ్యాంక్ మేనేజర్ ను కాపాడేందుకు వచ్చిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు.

వెట్రివేల్ ను అదుపోలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.  తాను అప్పుల్లో ఉన్నానని..లోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుందామనుకున్నానని చెప్పాడు. అయితే దీనిపై స్పందించిన బ్యాంకు అధికారలు వెట్రివేట్ అప్లై చేసుకున్న బ్యాంక్ రుణం ఎక్కువగా ఉన్నందున లోన్ రిలీజ్ చేయలేదన్నారు. ఒక వేళ అతను మరికొన్ని ఆస్తులు తాకట్టు పెట్టినా లోన్ మంజూరు చేయాలంటే బ్యాంక్  ప్రధాన కార్యాలయానిదే బాధ్యతని మేనేజర్ తెలిపారు.

Latest Updates