మెడిసిన్స్ అందించడానికి 150 కి.మీ. జర్నీ

కోల్ కతా: మెడిసిన్స్ కొరతతో ఇబ్బందిపడుతున్న ఓ పేషెంట్ కు మందులు అందించడానికి 150 కి.మీ. ప్రయాణించి ఒక వ్యక్తి మానవత్వాన్ని చాటుకున్నాడు. బెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా, చంద్రకొండకు సమీపంలోని మంగ్రూల్ అనే గ్రామంలో ఓ మహిళ హెపటైటిస్–బీతో బాధపడుతోంది. ఆమె వాడుతున్న మందులు అయిపోతుండటంతో వాటి కోసం కుటుంబీకులు చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. చివరికి ఈ విషయాన్ని వెస్ట్ బెంగాల్ రేడియో క్లబ్ కు చేరవేశారు. వెంటనే స్పందించిన బెంగాల్ రేడియో క్లబ్ ఫౌండర్ అంబరీష్ నాగ్ బిస్వాస్ మందులను పంపేందుకు రంగంలోకి దిగారు. ఆ మెడిసిన్స్ 24 పరగణాల జిల్లాలోని సోనాపూర్ లివర్ ఫౌండేషన్ లో దొరుకుతాయని తెలిసి ఆ సంస్థను సంప్రదించారు. మెడిసిన్స్ అందగానే.. సౌపర్ణ సేన్ అనే తమ క్లబ్ మెంబర్ తో మంగ్రూల్ విలేజ్ కు పంపారు. తమకు అవసరమైన మందుల స్టాక్ మంగళవారం అందిందని.. లాక్ డౌన్ ను ఎక్కువకాలం పొడిగిస్తే తమ ప్రాంతంలో మెడిసిన్స్ కొనలేమని పేషెంట్ కుటుంబీకులు తెలిపారు.

Latest Updates